
రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో మూడుసార్లు ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వక దాడి అని తేలడంతో ప్రియాంక తండ్రి, థియేటర్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక పరిస్థితి విషమంగా ఉందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ జుడా డిమాండ్ చేస్తోంది.