
ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా బిజ్రారీ గ్రామంలో హనిఫ్ మన్సూరి అనే వ్యక్తి తన 8 నెలల గర్భిణీ భార్య మనీషాను కొడవలితో నరికి చంపాడు.
మద్యం, జూదానికి బానిసైన నిందితుడు, శనివారం రాత్రి మద్యం తాగొద్దని వారించిన భార్యపై దాడి చేసి, ఐదేళ్ల కుమారుడు, రెండెళ్ల కుమార్తె కళ్లముందే ఆమెను పొట్టనబెట్టుకున్నాడు.
నిందితుడు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకోవాలని ప్రయత్నించగా, ఐదేళ్ల బాలుడు అసలు విషయం చెప్పడంతో పన్వారీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.