
గుండె ఆరోగ్యం, నాడీ కణాల రక్షణకు ఉపయోగపడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కేవలం చేపల్లోనే ఎక్కువగా ఉంటాయనేది ఒక భ్రమ మాత్రమే.
వంద గ్రాముల చేపలో 2.5 నుంచి 3 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండగా, అవిసె గింజల్లో 22 గ్రాముల వరకు లభిస్తాయి.
చియా గింజలు, వాల్నట్స్, మెంతికూర మరియు మునగాకులో కూడా తగిన మోతాదులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.