
బ్రిటన్‌లో 200 మందికి పైగా కుటుంబాలకు వారి ఆత్మీయుల చితాభస్మాన్ని మార్చి మోసం చేసిన రాబర్ట్ బుష్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష పడింది.
ఈశాన్య ఇంగ్లాండ్‌లోని హల్ క్రౌన్ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
48 ఏళ్ల రాబర్ట్ బుష్ అంత్యక్రియల నిర్వాహకుడిగా ఉంటూ పలు అక్రమాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.