
ప్రాథమిక విద్య మొదలుకుని ఉన్నత విద్య వరకు దేశంలో అన్నీ నాసిరకంగా ఉన్నాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
దేశంలో యువశక్తి పుష్కలంగా ఉన్నప్పటికీ వారి సత్తా చాటడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కరవయ్యాయని నివేదిక పేర్కొంది.
ఉన్నత విద్యా సంస్థల్లో మూడోవంతుకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా పడివున్నాయని తద్వారా ప్రమాణాలు మందగిస్తున్నాయని నివేదిక తెలిపింది.