
రష్యాలోని నిజ్నెకామ్స్క్ ఆయిల్ రిఫైనింగ్ హబ్‌పై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడిలో ఒక చిన్నారితో సహా 13 మంది మరణించారు.
సోమవారం జరిగిన ఈ దాడిలో మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారని, ఉక్రెయిన్ సరిహద్దుకు 1,200 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
లాంగ్ రేంజ్ డ్రోన్లతో రష్యా చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్న ఉక్రెయిన్, ఈ దాడుల ద్వారా రష్యాలో ఇంధన కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తోంది.