
అల్పపీడనం మరియు రుతుపవన ద్రోణి ప్రభావంతో సెప్టెంబర్ 5 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, సముద్రంలో అలజడి కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.
తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.