
శాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ Z ఫోల్డ్8 అల్ట్రా, Z ఫోల్డ్8, Z ఫ్లిప్8 మోడళ్లకు ప్రీ-ఆర్డర్లు ప్రారంభమైన 72 గంటల్లోనే 2.71 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి.
గత ఏడాది గెలాక్సీ Z ఫోల్డ్7, ఫ్లిప్7 మోడళ్లకు ఇదే స్థాయి బుకింగ్స్ రావడానికి 15 రోజులు పట్టగా, ఈసారి కేవలం 3 రోజుల్లోనే ఆ రికార్డును అధిగమించింది.
మొత్తం ప్రీ-బుకింగ్స్‌లో 45 శాతం వాటా టైర్-2 మరియు అంతకంటే చిన్న నగరాల నుంచే రావడం గమనార్హమని శాంసంగ్ సీఈఓ జేబీ పార్క్ వెల్లడించారు.