
రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ 5 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
హైదరాబాద్‌లోని బస్టాండ్లలో రద్దీ పెరగడంతో, ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ రద్దీ ఆగస్టు 28 మరియు 31 తేదీల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.