
హైదరాబాద్ రాయదుర్గంలోని పాన్ మక్తా భూముల వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వేలం ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
పిటిషనర్ జువ్వాడి ప్రణయ్ సింహారావు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం వాదించగా, ధర్మాసనం ఆ వాదనను పరిగణనలోకి తీసుకుంది.