డయాబెటిస్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జామ, యాపిల్ వంటి పండ్లు షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడతాయని, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం ద్వారా డయాబెటిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.