
లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూను స్కై స్పోర్ట్స్ ప్రసారం చేయడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాజకీయ అంశాలను ప్రసారం చేస్తే మ్యాచ్ను బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించినప్పటికీ, చివరికి మ్యాచ్ కొనసాగింది.
2023 ఆగస్టులో అరెస్టు అయిన 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో 14 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్నారు.