
ముస్లిం దేశాలు తమ విభేదాలను పక్కనపెట్టి, నాటో తరహాలో సామూహిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిలుపునిచ్చారు.
ఆగస్టు 7న మక్కాలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు ఒక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయని, దీని ప్రకారం ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మిగిలినవి స్పందిస్తాయని పేర్కొన్నారు.
ఈ రక్షణ కూటమిని కేవలం మూడు దేశాలకు పరిమితం చేయకుండా, భవిష్యత్తులో ఇతర ముస్లిం దేశాలను కూడా చేర్చుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు.