వాయవ్య పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ ఖ్వా రాష్ట్రంలో మసీదుపై ఆత్మాహుతి బాంబుదాడి జరిగింది.
శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా జరిగిన ఈ దాడిలో కనీసం 21 మంది మరణించారని అధికారులు తెలిపారు.
ఈ దుర్ఘటనలో సుమారు 78 మంది గాయపడినట్లు సమాచారం.