ఆరోగ్యవంతులు రోజుకు ఒకటి లేదా రెండు కోడిగుడ్లు తినడం మంచిదని, జిమ్ చేసేవారు కండరాల బలం కోసం రోజుకు 3 గుడ్లు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారు వారానికి 3-4 కోడిగుడ్లు మాత్రమే తినాలని, అదీ కేవలం తెల్లసొన మాత్రమే తీసుకోవడం మేలని పేర్కొన్నారు.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు పచ్చసొనను పూర్తిగా మానేయాలని, గర్భిణీలు డాక్టర్ సలహా మేరకు బాగా ఉడికించిన కోడిగుడ్లను తీసుకోవాలని సూచించారు.