
భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ చైనాకు చెందిన 250 SH-15 హావిట్జర్ ఆటోమేటిక్ ఆర్టిలరీ గన్స్‌ను వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించడం ప్రారంభించింది.
చైనా సంస్థ 'నోరిన్కో' తయారు చేసిన ఈ 155mm గన్స్, రోకెట్-అసిస్టెడ్ V-LAP గోళ్లతో 72 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సమక్షంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ వార్షికోత్సవం జరుపుకోవడం, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.