
అల్లూరి జిల్లాలోని పీసుమామిడి పేలుడు ఘటనలో ఏడుగురు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కార్మికులతోపాటు ప్రభుత్వ టీచర్ సునీత కూడా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.