అధిక ఆవలింతలు అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా, నిద్రలేమి, ఒత్తిడి లేదా కొన్ని రకాల మందుల వాడకం వల్ల రావచ్చని డాక్టర్ శిల్పా సింగి తెలిపారు.
నిద్రలో గురక, ఉదయాన్నే తలనొప్పి, పగటిపూట విపరీతమైన నిద్రమత్తు వంటి లక్షణాలు ఉంటే స్లీప్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆవలింతలు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అత్యవసర లక్షణాలతో కలిపి వస్తే వెంటనే వైద్య సహాయం పొందాలని హెచ్చరించారు.