అక్కినేని నాగార్జున కెరీర్‌లో 100వ చిత్రంగా తెరకెక్కుతున్న 'కింగ్ 100'లో నటి ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించడం దాదాపు ఖరారైంది.
దర్శకుడు రా కార్తీక్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ విషయం స్పష్టమైంది.
ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం రవితేజతో 'దాగుడుమూతల దండాకోర్', బాలకృష్ణతో 'ఎన్‌బీకే 111' వంటి చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.