
తెలంగాణలోని హనుమకొండ జిల్లా ములకనూరు సహకార సొసైటీకి చెందిన తెలంగాణ సోనా, జైశ్రీరామ్ రకాల బియ్యం అమెరికాకు ఎగుమతి కానున్నాయి.
ఈ ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, విశాఖపట్నం పోర్టు ద్వారా తొలి విడతగా 25 టన్నులను పంపాలని నిర్ణయించారు.
అమెరికా సంస్థ హార్వెస్ట్ లింక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఈ సొసైటీ ఏటా రూ. 100 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.