
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమి, ఇజ్రాయెల్లో నెతన్యాహు మెజారిటీ సాధించడంలో విఫలం కావడం వంటి పరిణామాలు అంతర్జాతీయంగా మార్పునకు సంకేతాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) విశ్లేషించింది.
ప్రజలు తమ సమస్యలన్నింటినీ ఒకే శక్తివంతమైన నాయకుడు పరిష్కరించగలడనే నమ్మకాన్ని కోల్పోతున్నారని, ప్రజాస్వామ్య స్వేచ్ఛలు, జవాబుదారీతనం విలువను తిరిగి గుర్తిస్తున్నారని సీజేపీ నేత అభిజీత్ దిప్కే తెలిపారు.
ప్రపంచ ఆధిపత్య వాగ్దానాల కంటే ఆర్థిక స్థిరత్వం, అందుబాటు ధరలో జీవన వ్యయం, జవాబుదారీతనం వంటి ప్రాథమిక అంశాలను ప్రజలు కోరుకుంటున్నారని సీజేపీ నేత సౌరవ్ దాస్ పేర్కొన్నారు.