
చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన జాంగు షియావోకియావో 'సుమా' అనే బ్రాండ్‌తో శరీర దురదను గోకే (itch-scratching) సేవలను అందిస్తూ నెలకు రూ. 14 లక్షలు ఆర్జిస్తున్నాడు.
ఈ సేవ కోసం గంటకు 300 యువాన్లు (సుమారు రూ. 4,200) వసూలు చేస్తుండగా, కస్టమర్లలో 70 శాతం మంది పురుషులేనని ఆయన తెలిపారు.
ప్రస్తుతం రెండు అవుట్‌లెట్లు నడుపుతున్న ఆయన, ఈ వ్యాపారాన్ని చైనా వ్యాప్తంగా 100 అవుట్‌లెట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.