
దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో సరికొత్త ఐమాక్స్ థియేటర్ ప్రారంభానికి సిద్ధమవుతోంది.
ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, ఈ ఏడాది డిసెంబర్లో ఇది ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
హాలీవుడ్ చిత్రం 'డూన్ 3' స్క్రీనింగ్‌తో ఈ ఐమాక్స్ థియేటర్ ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు.