
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన చివరి వన్డేలో స్లో ఓవర్ రేట్ నమోదవడంతో ఇరు జట్లపై ఐసీసీ మ్యాచ్ ఫీజులో కోత విధించింది.
భారత జట్టు మ్యాచ్ ఫీజులో 20 శాతం, వెస్టిండీస్ జట్టు ఫీజులో 10 శాతం జరిమానా విధించినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ తెలిపారు.
భారత్ నిర్ణీత సమయం కంటే నాలుగు ఓవర్లు, వెస్టిండీస్ రెండు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలడంతో ఇరు జట్ల కెప్టెన్లు తమ తప్పును అంగీకరించారు.