
గతంలో పది మంది చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఇప్పుడు ఒక్కరే చేయగలరని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు.
కంప్యూటర్‌పై చేసే ప్రతి ఉద్యోగానికి ఈ ముప్పు పొంచి ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
అయితే దీనివల్ల 90 శాతం ఉద్యోగాలు పోతాయని అర్థం కాదని, ఇది ఆర్థిక వ్యవస్థలో ఒక పునర్‌వ్యవస్థీకరణకు దారితీస్తుందని ఆయన వివరించారు.