
లగ్జరీ వాహన తయారీ సంస్థ ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా’ తమ ప్రముఖ ఎస్‌యూవీ ‘డిఫెండర్ 110’ ఉత్పత్తిని మహారాష్ట్రలోని పుణే ప్లాంట్‌లో ప్రారంభించింది.
దేశీయంగానే ఈ మోడల్‌ను అసెంబ్లింగ్ చేయడం ద్వారా టాప్–ఎండ్ వేరియంట్ ధర గరిష్టంగా రూ. 34 లక్షల వరకు తగ్గనుంది.
ఈ స్థానిక తయారీ నిర్ణయంతో రానున్న కాలంలో విక్రయాలు 20 శాతం వరకు పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.