
సెయింట్ లూయిస్‌లో జరుగుతున్న సింక్విఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద తన తొలి విజయాన్ని నమోదు చేశాడు.
రెండో రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ సిందరోవ్‌తో జరిగిన గేమ్‌లో ప్రజ్ఞానంద 95 ఎత్తుల తర్వాత ఆరు గంటల పోరాటం అనంతరం గెలుపొందాడు.
పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది రౌండ్లు నిర్వహించనున్నారు.