
రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర దాడులు జరుగుతున్న వేళ, రాబోయే రోజుల్లో కీలక పరిణామం జరగబోతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సన్నిహితుడు డిమిట్రో గోర్డాన్ వ్యాఖ్యానించారు.
ఆదివారం మాస్కోతోపాటు ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేసినట్లు రష్యా పేర్కొంది.
తమ రాజధాని వైపు వస్తున్న 1,600కు పైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు.