Economy
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం

AP7AM1h
THE BRIEF
1

ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలగించింది.

2

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934లోని రెండో షెడ్యూల్ నుంచి ఈ బ్యాంక్‌ను మినహాయించినట్లు ఆర్బీఐ నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

3

నియంత్రణ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తుండటంతో, సంస్థ కార్యకలాపాలు డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఈ ఏడాది ఏప్రిల్‌లో దీని లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేసింది.