
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గి ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు ప్రారంభమైనప్పటికీ, దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.
దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 930 పెరిగి రూ. 1,45,860 కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 850 పెరిగి రూ. 1,33,700 కు చేరింది.
మరోవైపు 18 క్యారెట్ల బంగారం ధర రూ. 690 పెరిగి రూ. 1,09,390 కి చేరగా, కిలో వెండి ధర రూ. 2.40 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.