
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై గురువారం హూతీ ఉగ్రవాదులు బాలిస్టిక్ క్షిపణులతో భీకరంగా దాడులు జరిపారు.
ఈ క్షిపణి దాడి ధాటికి నగరంలో పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించి తీవ్ర కలకలం రేపింది.
ఈ హూతీ దాడుల కారణంగా నగరంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ అరేబియా అధికారికంగా నిర్ధారించింది.