బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జూలై 31 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ సౌకర్యం కల్పించాలని ట్రాఫిక్ పోలీసులు జూలై 27న అడ్వైజరీ జారీ చేశారు.
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.