
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ముంబైలో తన కొత్త చిత్రం 'మాతృభూమి' ప్రచార కార్యక్రమంలో పాల్గొని 'రామాయణ' చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా బడ్జెట్ మరియు వీఎఫ్ఎక్స్ గురించి జరిగే చర్చకంటే కథ, పాత్రల గురించే ప్రధానంగా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన తన కొత్త చిత్రం 'మాతృభూమి' స్క్రిప్ట్‌ను ప్రభుత్వ ఒత్తిడి కారణంగా మార్చారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.