రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలలో వరుసగా రెండుసార్లు రెపో రేటు పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.
అక్టోబర్, డిసెంబర్ నెలల్లో జరిగే సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని సూచించింది.
ఈ పెంపు వల్ల బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను పెంచనుండటంతో నెలవారీ ఈఎంఐల భారం పెరగనుంది.