
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి, రాష్ట్రవ్యాప్తంగా 20.38 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో వర్షపాతం మెరుగుపడటంతో వానలోటు 53 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది, భారీ వర్షాలతో 696 టీఎంసీల నీరు రిజర్వాయర్లకు చేరింది.
రానున్న నాలుగు రోజులు బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది.