
రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'టాక్సిక్' ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ సుమారు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించగా, దీని థియేట్రికల్ బిజినెస్ విలువ దాదాపు 600 కోట్ల రూపాయల మేర జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12,000 స్క్రీన్లలో విడుదలవుతున్న ఈ చిత్రం, మొదటి రోజున 175 కోట్ల నుండి 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.