
నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి, వరద ప్రభావిత ప్రాంతాల్లో వారం రోజుల్లోనే 100 రెస్క్యూ మిషన్లు నిర్వహించి ప్రశంసలు అందుకుంటున్నారు.
41 ఏళ్ల ప్రియా, రసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో హెలికాప్టర్ ల్యాండ్ చేస్తూ తొలి రెండు రోజుల్లోనే 200 మందికి పైగా బాధితులను కాపాడారు.
2015 నాటి భూకంపం కంటే ప్రస్తుత వరద పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని, బురద కారణంగా ల్యాండింగ్ అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆమె తెలిపారు.