
అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ వేలం పాటలో ఒక అరబ్ వ్యక్తి తన మేనకోడలి కోసం రూ.3.85 కోట్ల విలువైన అరుదైన తెల్ల డేగను కొనుగోలు చేశాడు.
1.5 కేజీల బరువున్న ఈ 'ప్యూర్ వైట్ గైర్ గర్మోషా' డేగను షైకా అల్ మన్సూరీ అనే యువతి తన మేనమామతో కలిసి వేలంలో సొంతం చేసుకుంది.
ఈ వేలం పాట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఒక డేగ కోసం అంత భారీ మొత్తం ఖర్చు చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.