
అమెరికాలో జరుగుతున్న సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద ఐదో రౌండ్లో వెస్లీ సోతో డ్రా చేసుకుని 3 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం వెస్లీ సో 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ప్రజ్ఞానంద అతనికి అర పాయింట్ దూరంలో టైటిల్ రేసులో ఉన్నాడు.
ప్రజ్ఞానంద తన తదుపరి రౌండ్లో అరోనియన్తో తలపడనున్నాడు.