
విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ విషయాలు వెల్లడించారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రూ.64 వేల కోట్లతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.