
విజయవాడ రైల్వేస్టేషన్‌లో వందే భారత్ రైలు సీ4 కోచ్‌లో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది.
ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు వెంటనే బయటకు పరుగులు తీయగా, రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేశారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూటా లేదా మరేదైనా కారణమా అనే దానిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.