
జపాన్‌లో ఆదివారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించడంతో టోక్యో నగరం సహా తూర్పు ప్రాంతాలు వణికిపోయాయి.
ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా 37 మందికి పైగా గాయపడ్డారని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
దక్షిణ ఇబరాకీ ప్రీఫెక్చర్‌లో భూమికి దాదాపు 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.