
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ ఈనెల 27 నుంచి నవంబర్ 5 వరకు జరగనుండగా, డిఫెండింగ్ చాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడనుంది.
ఈ టోర్నీకి సంబంధించిన లీగ్ మ్యాచ్‌లు జలంధర్‌లో, నాకౌట్ మ్యాచ్‌లు మొహాలీలో నిర్వహించనున్నారు.
భారత్‌తో పాటు మలేసియా, జపాన్, సౌత్ కొరియా, చైనా, బంగ్లాదేశ్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి.