
తమిళనాడులోని ధారాపురం ఉప ఎన్నిక ప్రచారంలో టీవీకే అభ్యర్థి సత్యభామపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ఆమెను కించపరిచేలా మాట్లాడారంటూ టీవీకే నేతలు మండిపడటంతో పాటు స్టాలిన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ధారాపురం నియోజకవర్గానికి అక్టోబర్ 6న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయ వేడిని పెంచాయి.