
మెగా డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు విశాఖపట్నంలో భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించి వైసీపీ విషప్రచారాన్ని ఖండించారు.
విక్టరీ ఎట్ సీ నుంచి ఆర్కే బీచ్ వరకు సాగిన ఈ ర్యాలీలో నాలుగు ఉమ్మడి జిల్లాల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం తప్పదని ఉపాధ్యాయులు హెచ్చరించారు.