
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గది తలుపులు ఎప్పుడూ ఆటగాళ్ల కోసం తెరిచి ఉండేవని అజింక్యా రహానే గుర్తు చేసుకున్నారు.
సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తూ, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం ధోనీ ప్రత్యేకత అని రహానే ప్రశంసించారు.
ధోనీ గదిలో ఒకేసారి 10 నుంచి 15 మంది ఆటగాళ్లు కలిసి సరదాగా గడిపేవారని ఆయన తెలిపారు.