
నల్గొండలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసిన కేసులో ఇద్దరు పదో తరగతి విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు ప్రిన్సిపాల్‌ను 27 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ పవార్ వెల్లడించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్న పోలీసులు, నిందితులను జువైనల్ హోమ్‌కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.