
ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు.
పీఆర్సీ అమలు, ఆరు డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్లను టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ బొంకూరి శంకర్ ప్రభుత్వం ముందు ఉంచారు.
సమస్యలు పరిష్కరించని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.