
నంద్యాల సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఈశ్వర గోపాల్ అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు కర్నూలుతో పాటు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
అధికారుల తనిఖీల్లో సుమారు రూ. 2.8 కోట్ల విలువైన పత్రాలు లభించగా, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
ఈ సోదాల్లో 2 కిలోల వెండి, 3 తులాల బంగారం, రూ. 25 లక్షల విలువైన గృహోపకరణాలతో పాటు పలు ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.