
అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ వన్ పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, వచ్చే నెల మొదటి వారంలో జిల్లాకు గోదావరి జలాలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
మాడుగుల నియోజకవర్గంలో 10 వేల ఎకరాల భూసేకరణతో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తామని, రూ. 29 కోట్లతో తారకరామ రిజర్వాయర్ పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జిల్లాలో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ సిటీ, డేటా సెంటర్లు, ఫార్మా మరియు అల్యూమినియం పరిశ్రమల రాకతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు.